అదిల నుంచి హంపి దాక
కృష్ణరాయని కీర్తి చుసినశబరి నుంచి పెన్న దాక
ఆంద్రకేసరి పఠిమ గాంచిన
అరుకు నుంచి కడప దాక
ఎన్టిఆరునీ ప్రతిభ ఎరిగినతెలుగు తల్లి వారసులకు
గౌరవప్రియ వందనం
ఆవకాయ రుచిని మరిగిన
సక్కినాలు పంట కొరికిన
ఉలవచారు జుర్రు కున్నిన
మినపసున్ని నోట మింగిన
ముద్దపప్పు అంతు చుసిన
గుత్తి వంకాయి ఆరగించిన
తెలుగు తల్లి వారసులకు
షడ్రుచోపేత వందనం
ఏడు కొండలు ఎదురుచూసిన
తాళ్ళపాక కృతులు విన్న
రామ భద్రుని నిలువరించిన
రామదాసుని పదము విన్న
నాల్గు జాతులు ముగ్డులైన
త్యాగరాయ కృతులు విన్నరామదాసుని పదము విన్న
నాల్గు జాతులు ముగ్డులైన
తెలుగుతల్లి వారసులకు
సరిగమప్రియ వందనం
ఆదికావ్యమును పలకరించిన
ననయభట్టు రచన చదివిన
సరసరసమును వోలకబోసిన
సార్వభౌముని చాటు చదివిన
అల్లికల లో ఆరితేరిన
అల్లసాని కవిత చదివిన
తెలుగుతల్లి వారసులకు