Tuesday, December 29, 2009

సమయసాగరం లంఘించర

అల ఒక దినమై ముందుకు కదిలి
దూషణ పోషణ సాగర ఘోషల
మబ్బుల చినుకుల సవ్వడి వింటూ
మింటి రాజుతో పోటి పడుతూ
సమయసాగరం లంఘించర !
- ఆశీష్

Saturday, October 31, 2009

అక్షర శరము సూటిగా వదిలి
కచట తపల గర్జన చేస్తూ
చక్షువు నిండా అగ్గిని నింపి
అచ్చుల హల్లుల అడుగులు వేస్తూ
దీక్షగ నువ్వు ముందుకు కదలి
హస్తిన సైతం అలికిడి వింటూ
ముష్కర నేతల బానిసగున్న
తెలుగు తల్లిని విడిపించగ రా !

Sunday, October 18, 2009

అంకెలన్నీ చుక్కలై చుక్కలన్నీ కాసులై
కాసులన్నీ నవ్వులై నవ్వులన్ని దివ్వెలై
దివ్వెలన్ని జిలుగుమంటు మువ్వలగా ఘల్లుమంటు
జువ్వ లాగ రివ్వుమంటూ
కమన గమన కవన రచన సాగించరా


ధారుణి మైత్రెయ కాంచన వర్ణాయ
దీపాయ ప్రజ్ఞ రూపాయ
భాస్కరధ్యుతి సామ్యాయ
నమొస్తుతె దీప బ్రహ్మాయ

Sunday, September 27, 2009

చలువ చల్లని చూపే నీది మీనాక్షి
కలువ ఆసిని నువ్వే మా గీర్వాణి
నిలువ భక్తీ నీ మీదే మా కామాక్షి
పిలువ కటాక్షించే నువ్వే మా శర్వాణి

పరిక్షించకే అల్పులము మము వైష్ణవి
రక్షింపవే దీనులము మము శాంకరి
క్షణ నిరీక్షణ కాక కావు మము వాసవి
శిక్షించకే మూఢులము మము హ్రీంకరి

Friday, August 7, 2009

స్వర్గతుల్యమే మీ నవ్యగృహము

హరిచాపమే తోరణమాయే మిద్దె మింట
కల్పవ్రిక్షమే తులసిమోక్కాయే మీఇంట
కామధేనువే కాలుమోపును మీ గడపంట
అమృతపాకమే వండివడ్డింతురు మీ వంటింట
స్వర్గతుల్యమే మీ నవ్యగృహము ఆదైవం అంట

Saturday, August 1, 2009

కలువపూల యోగివాడు సిరులుగల్గిన భోగివాడు

కలువపూల యోగివాడు సిరులుగల్గిన భోగివాడు
హరునిసైతం మాయజేసె వేయిపేర్ల మాయలోడు

రథమునైన తోలేవాడు కోతిమూకల గారడోడు
కత్తిసైతం మర్చిపోయి మొసలిజంపిన మావటోడు

బలినితోక్కిన పొట్టివాడు విల్లుపట్టిన పొడగరాడు
వెన్నజున్నులు దొంగలించే ద్వారకేలే రాజువాడు

కొండనైన మోసేటోడు గోడలోన దాగినోడు
రాయినైనా మనిషి చేసిన శిల్పివాడు

Wednesday, July 29, 2009

సతతము వర్ధిల్లు సాయినాధవరసుత

మా నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా నేను రాసిన పద్యం

శకుంతలసుత ధీ బలోధిత
అర్థశాస్త్ర వేద్య అన్య పాండిత్యవేత్త
సర్వజనహితకర్మన్యోనుత
బాధ్యతాయుత సర్వోత్తమపిత
త్వమసుత హితరక్షన్విత
సతతము వర్ధిల్లు సాయినాధవరసుత


Saturday, July 25, 2009

తెలుగుతల్లి వారసులకు వందనం

అదిల నుంచి హంపి దాక
కృష్ణరాయని కీర్తి చుసిన

శబరి నుంచి పెన్న దాక
ఆంద్రకేసరి పఠిమ గాంచిన

అరుకు నుంచి కడప దాక
ఎన్టిఆరునీ ప్రతిభ ఎరిగిన

తెలుగు తల్లి వారసులకు
గౌరవప్రియ వందనం

ఆవకాయ రుచిని మరిగిన
సక్కినాలు పంట కొరికిన

ఉలవచారు జుర్రు కున్నిన
మినపసున్ని నోట మింగిన

ముద్దపప్పు అంతు చుసిన
గుత్తి వంకాయి ఆరగించిన

తెలుగు తల్లి వారసులకు
షడ్రుచోపేత వందనం

ఏడు కొండలు ఎదురుచూసిన
తాళ్ళపాక కృతులు విన్న

రామ భద్రుని నిలువరించిన
రామదాసుని పదము విన్న

నాల్గు జాతులు ముగ్డులైన
త్యాగరాయ కృతులు విన్న

తెలుగుతల్లి వారసులకు
సరిగమప్రియ వందనం


ఆదికావ్యమును పలకరించిన
ననయభట్టు రచన చదివిన

సరసరసమును వోలకబోసిన
సార్వభౌముని చాటు చదివిన

అల్లికల లో ఆరితేరిన
అల్లసాని కవిత చదివిన


తెలుగుతల్లి వారసులకు
సాహితిప్రియ వందనం







Thursday, July 23, 2009

నేర్వవోయి తెలుగు తెలుగు !

తేట తేట పాల నురుగు,
అక్షరాల విరుల వాగు
చుక్కలమ్మ కాంతి వెలుగు,
కన్న తల్లి తెలుగు తెలుగు !

జాలమంతా తెలుగు పెరుగు
తెలుగుబ్లాగు అయ్యే మెరుగు
గోడలన్నీ విరుగు విరుగు
కొత్తబ్లాగు తెలుగు తెలుగు !

పొరుగు భాష కొంత తరుగు
సొంత భాష నేర్చ మెరుగు
గంగిగోవు పాల పొదుగు
అమ్మ భాష తెలుగు తెలుగు !

సిగ్గు పడకు, వాడు తెలుగు
నేర్పు నువ్వు కొంత తెలుగు
తెలుగు భాష జాతి సొబగు
నేర్వవోయి తెలుగు తెలుగు !

Tuesday, July 21, 2009

భరతమాత అష్టకం

త్రివర్ణకేతు ధారిణి సుధారస సుభాషిణి
మయూరవ్యాఘ్ర పోషిణి నమోస్తుతే నమోస్తుతే

సింధుకృష్ణ మాలికే మగధచోళ నాయికే
కతకభరత నర్తికే నమోస్తుతే నమోస్తుతే

క్షమోధరిక శాసిని మహావైవిధ్య రూపిణి
సమస్తజాతి మాత్రుకే నమోస్తుతే నమోస్తుతే

వేదాంగవెద్య సాక్షిక గీతోపనిషద్య కృత్తిక
బ్రహ్మండతత్వ మూలిక నమోస్తుతే నమోస్తుతే

హిమమ్ముకుట ధారిణి సేతుపీఠ స్తారిణి
భరతవర్ష ధారుణి
నమోస్తుతే నమోస్తుతే


నానాధర్మాణి స్థాపిక చతుర్ధిగ్ద వ్యాపిక
అనేకభాషా సూత్రిక నమోస్తుతే నమోస్తుతే

సప్తసింధు వాహిని సప్తనాద గాయిణి
ఆదితాళ మూర్ధని నమోస్తుతే నమోస్తుతే


ధర్మచక్ర భూషికే కర్మరాజ్య పాలికే
నమోస్తు భరత మాతరం నమోస్తు భరత మాతరం

Wednesday, July 15, 2009

సాగరమధనం చిందించే గరళరసము
రసోపానం చేసనే చంద్రశేఖరుడు
గరళశేషం పతించే ఇలకు
అది పండించే మానవ బీజము



Tuesday, July 14, 2009

కరివదనుని పార్థుడు నేలగూల్చేన్

ద్రోణుని భీకర పోరు కాన్చగనె
విచలితులయరి పాండుసుతుల్ కాన
శ్యాముని ఉపాయముసే అశ్వథామయన్
కరివదనుని పార్థుడు నేలగూల్చెన్

Sunday, July 12, 2009

ఉన్న పండుగుల్ చాలువా సుమీ ?

కట్లపాము తరుచు కుబుస విడువ
పక్షిఈకలు రోజు నేల కొరిగెన్
జన్మదినంబుల్ అట్టివే కదా
ఉన్న పండుగుల్ చాలువా సుమీ

-ఆశీష్
నా జన్మదిన సందర్భంగా నేను రాసుకున్న పద్యమో కవితో ఏమంటే అది ..

గీత పాలుత్రాగి అటుకులు తిని న నీకు జే జే !

సురపతి కుమరునకు ఏమి చెప్పెన్ ?
పూతనను ఎట్లు చంపెన్ ?
కుచేలునికి ఎట్లు సిరినోసగెన్?
గీత, పాలుత్రాగి, అటుకులు తిని న నీకు జే జే !

-ఆశీష్

ఈ పద్యంలో కృష్ణుడు ఏం ఏం చెశాడు అనేది ఉద్దేశం. ఆ సమస్యలో ఒక్క-ఒక్క సమాధాన్ని ఒక్క-ఒక్క ప్రశ్నతో అన్వయించడం వలన సమస్య అర్థం అవుతుంది.

Saturday, July 11, 2009

పెండ్లికూతురు వేశ్యగృహం పాలాయెన్

రాజపోషణలేని భాష వక్రమార్గమోసంగి
గానసౌరభాలు రిమిక్సుల వశమాయే
విధిని ఏమని చెప్పెదన్
పెండ్లికూతురు వేశ్యగృహం పాలాయెన్

-ఆశీష్

ఈ సమస్యని ఇచ్చినవారు నా స్నేహితుడు ప్రశాంత్ కనికిచెర్ల

గంజాయి పానకము త్రాగిజేసే రామ భజన

విత్తము జేబూని ఆలయమ్బుకు వెడలి
సిఫార్సుగొనిపోయి దొడ్డ ప్రసాదమ్బుల్మ్రెక్కి
చిత్తము ఇంటవిడిచి వచ్చే దినినిఎమన్నేన్
గంజాయి పానకము త్రాగిజేసే రామ భజన

-ఆశిష్

Tuesday, July 7, 2009

నరెంద్రువాచ

కార్యాలు ఫలిమ్పబోయిన రానున్న కాలం ఆగునా
వేచిఉండి చుడమానుర వేచిఉండి చుడమానుర

మేఘాల్కి లేని ఎల్లలు మనస్సుల్ కి ఎల-ఎలని
యోచించువాడే మనిషి ర యోచించువాడే మనిషి ర

భోధించువాడే యోగైతే ప్రపంచం అంత యోగులే
తపించువాడే హంస ర తపించువాడే హంస

త్యజిస్తే తప్ప కాదని క్రియిస్తే మేలు కాదని
తలంపే నీకు వద్దు ర తలంపే నీకు వద్దు

గ్రహిస్తే తపోవీక్షణం వాసనలని తరమవచ్చులే
అదే నరెంద్రువాచఅదే నరెంద్రువాచ

Thursday, July 2, 2009

విధాత తలపున ! - సిరివెన్నెల

సిరివెన్నెలగారు రచించిన విధాత తలపున గానానికి నేను చేసిన ఆంగ్ల అనువాదం కింద చూడగలరు

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
vidhaata talapuna prabhavinchinadi anaadi jeevana vEdam
The wisdom of life that originated in the Creator's mind.

ఓం ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
Om! praaNa naaDulaku spandana nosagina aadi praNava naadam
Om is the primordial sound, that stimulates the nerves

ఓం కనుల కొలనులో ప్రతిబింభించిన విశ్వరూప విన్యాసం
Om! kanula kolanulO pratibim binchina viSvaroopa vinyaasam
Om is the sound, that reflected as a great form in my eyes like a lake.

ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
eda kanumalalO pratidhvaninchina virinchi vipanchi gaanam
Om is the sound, that resonated in my heart of moutains

సరసస్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది
sara sasvara sura jarI gamanamou saamavEda saaramidi
this is a sweet and melodious stream that flows like the gist of Sama veda (knowledge of music)

నేపాడిన జీవన గీతం ఈ గీతం
nE paaDina jeevana geetam ee geetam
I m singing my life as a song.

విరించినై విరచించితిని ఈ కవనం
virinchinai virachinchitini ee kavanam
As a creator (virinchi) I wrote this song.

విపంచినై వినిపించితిని ఈ గీతం
vipanchinai vinipinchitini ee geetam
As a bird I m tweeting this song.


మొదటి చరణం

ప్రార్దిశ వేణియ పైన దినకర మయూఖ తంత్రులపైన
జాగ్రుత విహంగ తతులై వినీల గగనపు వేదికపైన
prathisa vaeneeya paina dinakara mayoogha tantrulapaina..
jagrutha vihanga tathulai vineela gaganapu vedica paina...::


Veena that is formed in prar-disha [in the direction of sunrise] with sun-rays as its strings.
animated birds are playing the strings of that veena on the stage of sky [gaganapu vedika]

పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారముకాగ

విశ్వకార్యమునకిది భాష్యముగా
palikina kilakila tvanamula swaragathi jagathiki sreekaramu kaaga..
viswakaryamunakidi bhashyamugaaa

those rhythmic tweets of the birds, initiate the beginning of the universe.
annotate the creation of universe

రెండవ చరణము:
జనించు ప్రతిశిషు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
janinchu prathisishu galamuna palikina jeevananaada tarangam
chetana pondina spandana dhvaninchu hrudayamrudangadhvanam...:

the tune of life that forms every infant's cry
animated and enthusiastic sounds of the percussion (i.e. heart) [refering to heart beat]

అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముని
anaadiraagam aadi talamuna anantha jeevana vaahini gaa..
saagina srushti vilaasamu ni...

with primordial melody in primordial beat flowing like an unstoppable river (i.e. life)
thus continued the creation of universe ....

నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం
naa uchwasam kavanam naa nishwasam gaanam....:
my inhalation is a hymn, my exhalation is a song..

సరసస్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం
sarasaswarasurajhareegamanamavu samaveda saramidi...
nepaadina jeevana geetham...ee geetham..
this is a sweet and melodious stream that flows like the gist of Sama veda (knowledge of music)
I m singing my life as a song....

Sunday, June 28, 2009

రాగోపాసన

జ్వలించే మనో ధారాలో
జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో
సుమించే రసజ్ఞ మాధురి

ధ్వనించే యుద్ధభేరిలో
స్వరించే కదనకుతూహలం

బ్రహ్మించే ఇంద్రియాలలో
స్ఫురించే భావనప్రియం

జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి

గ్రీష్మించే సూర్య జ్వాలలో
చిందించే జలర్నవమ్

హిమించే కైలశాగిరులలో
నర్తించే నాటభైరవి

జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి

పఠించే వేదాంగాలలో
కనిపించు సారమే పావని

వినిపించే వీణ మీటలో
జనించు నాదమే కీరవాణి
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి







Monday, June 1, 2009

కారంగా వెటకారం

ఆకాశంలో మేఘాల ఈ దేశాలు
మధన పడి పండిస్తాయ పంటలు
అగ్నిహోత్రాల ఈ శస్త్రాలు
ప్రతి కణం జ్వలించి కురిపిస్తాయ జల్లులు
దేవతల ఈ నాయకులు
మంత్రాలతో కురిపిస్తారా చింతకాయలు
నీటి అలల ఈ రోజులు
వెనక్కి వచ్చి తీరుస్తాయ కలలు

Tuesday, May 19, 2009

రథం కదిలితే మంచు కరిగితే
వారు చస్తే వీరు వస్తే

ప్రజలేమో వెర్రివాళ్ళు
నమ్ముతారు అబ్బదాలు
రాజరికము అయ్యి చస్తే
నేతికేక్కి కొమ్ము కాస్తే
మంది-మందగా డబ్బు తింటే
నిరసించి ఏడ్చిఏడ్చి
పేగుల దండలు మెడలో వేస్తె
స్మశానంలో చోటు లేక
ఊరిలోనే తగలబెడితే
నక్క ఊలల చరమ గీతం వింటూ వింటూ నిద్రపో

Wednesday, May 13, 2009

నీ చెయ్యి వేసిన చెత్త

I was moved after knowing about garbage island which is twice as large as state of Texas, that formed in the pacific ocean.

More about Garbage Island on Wiki
http://en.wikipedia.org/wiki/Great_Pacific_Garbage_Patch

సురగంగని రప్పిస్తే
ఆగుతుందా ఈ దాహం
కల్పవృక్షం పెకలిస్తే
పండుతుందా ఈ నేల
క్షీరసాగరం కడుగుతుందా
నీ చెయ్యి వేసిన చెత్తను

చెట్టు పెంచి పండ్లు కొట్టి
చెట్టు కొట్టి కలప కొంటె
కలప తిరిగి చేట్టగున

నీటిలోన బురద మేలు
విరిగిపోయి కరిగిపోయి ఏకమైతే
ప్లాస్టిక్ వేసి కుల్లిబెట్టినావు నీటినంత

సురగంగని రప్పిస్తే
ఆగుతుందా దాహం
కల్పవృక్షం పెకలిస్తే
పండుతుందా నేల
క్షీరసాగరం కడుగుతుందా
నీ చెయ్యి వేసిన చెత్తను

Saturday, May 9, 2009

క్షీర సాగరం - అమ్మ ఒడి

మాతృదినోత్సవం సంధర్బంగా నేను రాసిన ఈ కవిత ....
పాల కడలిని చిలికి చిలికి విస్తు పోయిన దేవదానవులు
అమృతమును సేవించి గర్వపడిన దేవదానవులు మనుజ జాతిని వెక్కిరించెను
హరిహరులు మందహాసముతో అన్నేనపుడు
అమ్మ ఒడిలో ఒదిగినవారికి క్షీర సాగర మదనమెల

Tuesday, May 5, 2009

సాధించెనే

ఎడారి ఏకాకి పక్షిలా ఎటో చూస్తూ నువ్వలా
కలో నిజమో తెలియక ఎటో చూస్తూ నువ్వలా
సాధించింది ఏమి లేదని
కొంతైనా నేర్వలేదని ఎటో చూస్తూ నువ్వలా
ఎటో చూస్తూ నువ్వలా
ఎంతైనా కాలం పారని వెన్నకి మల్ల వచ్చు లే
కాలని నడుపు యోచనే
యోచనలు ఆచరించులే
కాలం వెన్నకి తగ్గని
తప్పుల్ని సరి దిద్దులే
తప్పేమీ తప్పు కాదు లే
పాఠాలు నువ్వు నేర్చుకో

Sunday, May 3, 2009

ఇదం కాలం పూర్ణమ అదం కాలం పూర్ణం

వృక్షం జీవన వృత్తం విశిష్ట జీవ పదార్థం
అర్థంవిన ప్రాణకోటి లక్ష్యం జీవన చక్రం
శిష్ట దుష్ట మిత్యమ గుణవిశ్చెదమ్
ఏకసచ బహు రూపం బాహ్య వీక్షణ స్వరూపం
ఏవం చైతన్యం న మనః న దేహం నాస్తి ఆత్మా
న జంతు న విహంగ న చిత్రం న గానం న విష్ణు న శివం నాస్తి సర్వ భూతాది దైవం
న యుగాది న యుగాంత ఇదం కాలం పూర్ణమ అదం కాలం పూర్ణం

Monday, April 27, 2009

కృత్రిమ నీరు పారును
స్థూలమైన కాయము సహజము

Saturday, April 11, 2009

చకోరవా విహరివా కృష్ణప్రియ మయురవ

చకోరవా విహరివా కృష్ణప్రియ మయురివ
డంకారివ హ్రుంకారివ విశ్వబీజ ఓంకారివ
ఉచ్చ్వసవ నిశ్వసవ చైతన్య ప్రాణ వాయువ
నిశితివ ప్రభాతవ తమోఅభ ద్వికారివ
భోగివ యోగివ సమ-స్థిర హంసవ
చక్షువ కర్ణవ నిరంతర శ్రామిక నాసికవ
ద్వైతివ అద్వైతివ అనేక తత్త్వ మూలానివా
అర్కునివ చంద్రునివ సమస్త తార కాంతివా
అగ్నివ అనిలవ ధాతుమూల తోయానివ

Wednesday, April 8, 2009

వేయి ఖాండవ వనాల దహాగ్నితో , కోటి సూర్య ప్రభాతము తో ...
జగమేరిగిన ఋషివోలె నీ తపము సాగించు సాగించు
వేనుతిరగని రామబాణమొలె నీ గురిని చేదించు చేదించు
నిశబ్దభెదిఐన పంచజన్యమోలె నీ పిలుపు వినిపించు విన్పించు
జగాన్త్కమైన శివతాన్డవమొలె నీ నర్తన నర్తించు నర్తించు

అడ్డు అదుపు లేని ఓహ్ విహంగమ
తరగని ఓరిమే నీ ఇంధనమ
ఆకసాన ఎగసిన ఓ తరంగమ
నీ ఆత్మబలమే నీ ధనమ

Saturday, April 4, 2009

ఆకసాన విహంగమ గాలికూగు చేట్టుకోమ్మా
ఎవరివారి పరవసమ లేక అదేదో చిత్రమా

సూరీడి ప్రకోపమా తెల్ల మబ్బు శాంతమ
వెలిగిపోయిన నీలి అకాసమ ఎవరు కారణమ్మ

ఆకసాన పక్షి పిల్ల సరసులోన చేప పిల్ల
ఆవేశం సంనగిల్ల అదో పెద్ద కల్ల
చుట్టూ తిరిగి వస్తే మల్ల


కులబజారులో అరాజకీయం

కొను కొను రకరకాల కులాల వోటు
పెను పెను మార్పూ కోసం పంచు నోటు
కులకులనికి పెంచు రేటు
వేయి విలువలపై వేటు

కులబజారులో దొరుకు అన్ని సరుకులు
ఏ అంగడి లో దొరకవు ఇ చౌకబెరాలు
కులకులనికి వచ్చు కొత్త విలువలు
మౌలిక విలువల్ని చంపే సరికొత్త ధరలు

కోట్లు పెట్టి నోట్లు పంచి నీ నోట్లో బురద కొట్టి
కావలించి బుజ్జగించి గెలిచినాక ఈసిడిన్చి
బువ్వ పెట్టి నీ పొట్ట కోసి చేతలో పెట్టి
వల్లకాడికి పంపించి నీ చితి నీచేత అంటించి
నిస్వార్ధంగా నీ సార్ధం పెట్టి పోదురు ....

Saturday, March 28, 2009

నీకు నువ్వే దిక్కు

దిక్కు దిక్కు వెతకినావు ఆకలి తో అలమినావు
దిక్కుమాలిన బతుకని నిరసిన్చి ఎడ్చినావు
దిక్కులేని నాకు, చావే దిక్కన్నావు

తూరుపింట సూరీడు పశ్చిమాన పొడవాడని
దిక్కు దిక్కు ఏకమై గర్వ పడిన నాడు
పశ్చిమాన నల్ల సురిడూ ఉదయంచి
దిక్కులన్ని తప్పు అని నిరూపించినాడు

నిన్ను నువ్వు నమ్ముకుని
దిక్సూచిగా నిలవమని
చెప్పలేదా ఆ నాడు మహాత్ముడు
మరల చెప్పలేదా ఎందరొ మహానభావులు

Saturday, March 21, 2009

కలువ పూల చేరువంట, రంగు-రంగుల కలువలంట
ఆ కలువ ఆకుల మీద ముత్యాల మంచు బిందువులంట

ఆ కలువ కింద ఏముందో ఎవరికీ ఎరుకంట
ఆ కలువ తెంపి చూడమంట , చెరువంతా బురదంట

कमल का तालाब था, रंग भिरंगे कमल का घर था
कमल के पत्ते पर मोति जैसी ओउस की बूँदें थीं


पर कमल के पत्ते के नीचे क्या छुपा कौन जाने
पर उस पत्ते को पलटके तो देखो वहां गंगा नही गन्दगी है

Friday, March 20, 2009

ఎదుగుదల

వాడ్ని కొట్టి వీడని కొట్టి నిన్ను కొట్టి నేను ఎదిగాను
ఎదిగి ఎదిగి పైకెదిగి నన్నే మించలనుకున్నాను
నన్ను నేను కొట్టి చంపుకుని ఒంటరిగా మిగిలాను

నడిచోచిన సంద్రం

నడిచోచిన సంద్రం, బ్రతుకు బండి నడపలేని ఎడారి కోసం,

చెమ్మ చేర్చి దాహ్తీర్చి ఇసుక తడిపిన సంద్రం

దాహం తీరిన మరల మరల ఇంకి పోయిన ఎడారి కోసం మరల మరల నడిచోచిన సంద్రం

కలువపూల చెరువు

కలువ పూల చేరువంట, రంగు-రంగుల కలువలంట
ఆ కలువ ఆకుల మీద ముత్యాల మంచు బిందువులంట

ఆ కలువ కింద ఏముందో ఎవరికీ ఎరుకంట
ఆ కలువ తెంపి చూడమంట , చెరువంతా బురదంట