Saturday, October 31, 2009

అక్షర శరము సూటిగా వదిలి
కచట తపల గర్జన చేస్తూ
చక్షువు నిండా అగ్గిని నింపి
అచ్చుల హల్లుల అడుగులు వేస్తూ
దీక్షగ నువ్వు ముందుకు కదలి
హస్తిన సైతం అలికిడి వింటూ
ముష్కర నేతల బానిసగున్న
తెలుగు తల్లిని విడిపించగ రా !

Sunday, October 18, 2009

అంకెలన్నీ చుక్కలై చుక్కలన్నీ కాసులై
కాసులన్నీ నవ్వులై నవ్వులన్ని దివ్వెలై
దివ్వెలన్ని జిలుగుమంటు మువ్వలగా ఘల్లుమంటు
జువ్వ లాగ రివ్వుమంటూ
కమన గమన కవన రచన సాగించరా


ధారుణి మైత్రెయ కాంచన వర్ణాయ
దీపాయ ప్రజ్ఞ రూపాయ
భాస్కరధ్యుతి సామ్యాయ
నమొస్తుతె దీప బ్రహ్మాయ