Friday, August 7, 2009

స్వర్గతుల్యమే మీ నవ్యగృహము

హరిచాపమే తోరణమాయే మిద్దె మింట
కల్పవ్రిక్షమే తులసిమోక్కాయే మీఇంట
కామధేనువే కాలుమోపును మీ గడపంట
అమృతపాకమే వండివడ్డింతురు మీ వంటింట
స్వర్గతుల్యమే మీ నవ్యగృహము ఆదైవం అంట

Saturday, August 1, 2009

కలువపూల యోగివాడు సిరులుగల్గిన భోగివాడు

కలువపూల యోగివాడు సిరులుగల్గిన భోగివాడు
హరునిసైతం మాయజేసె వేయిపేర్ల మాయలోడు

రథమునైన తోలేవాడు కోతిమూకల గారడోడు
కత్తిసైతం మర్చిపోయి మొసలిజంపిన మావటోడు

బలినితోక్కిన పొట్టివాడు విల్లుపట్టిన పొడగరాడు
వెన్నజున్నులు దొంగలించే ద్వారకేలే రాజువాడు

కొండనైన మోసేటోడు గోడలోన దాగినోడు
రాయినైనా మనిషి చేసిన శిల్పివాడు