Tuesday, December 29, 2009

సమయసాగరం లంఘించర

అల ఒక దినమై ముందుకు కదిలి
దూషణ పోషణ సాగర ఘోషల
మబ్బుల చినుకుల సవ్వడి వింటూ
మింటి రాజుతో పోటి పడుతూ
సమయసాగరం లంఘించర !
- ఆశీష్

Saturday, October 31, 2009

అక్షర శరము సూటిగా వదిలి
కచట తపల గర్జన చేస్తూ
చక్షువు నిండా అగ్గిని నింపి
అచ్చుల హల్లుల అడుగులు వేస్తూ
దీక్షగ నువ్వు ముందుకు కదలి
హస్తిన సైతం అలికిడి వింటూ
ముష్కర నేతల బానిసగున్న
తెలుగు తల్లిని విడిపించగ రా !

Sunday, October 18, 2009

అంకెలన్నీ చుక్కలై చుక్కలన్నీ కాసులై
కాసులన్నీ నవ్వులై నవ్వులన్ని దివ్వెలై
దివ్వెలన్ని జిలుగుమంటు మువ్వలగా ఘల్లుమంటు
జువ్వ లాగ రివ్వుమంటూ
కమన గమన కవన రచన సాగించరా


ధారుణి మైత్రెయ కాంచన వర్ణాయ
దీపాయ ప్రజ్ఞ రూపాయ
భాస్కరధ్యుతి సామ్యాయ
నమొస్తుతె దీప బ్రహ్మాయ

Sunday, September 27, 2009

చలువ చల్లని చూపే నీది మీనాక్షి
కలువ ఆసిని నువ్వే మా గీర్వాణి
నిలువ భక్తీ నీ మీదే మా కామాక్షి
పిలువ కటాక్షించే నువ్వే మా శర్వాణి

పరిక్షించకే అల్పులము మము వైష్ణవి
రక్షింపవే దీనులము మము శాంకరి
క్షణ నిరీక్షణ కాక కావు మము వాసవి
శిక్షించకే మూఢులము మము హ్రీంకరి

Friday, August 7, 2009

స్వర్గతుల్యమే మీ నవ్యగృహము

హరిచాపమే తోరణమాయే మిద్దె మింట
కల్పవ్రిక్షమే తులసిమోక్కాయే మీఇంట
కామధేనువే కాలుమోపును మీ గడపంట
అమృతపాకమే వండివడ్డింతురు మీ వంటింట
స్వర్గతుల్యమే మీ నవ్యగృహము ఆదైవం అంట

Saturday, August 1, 2009

కలువపూల యోగివాడు సిరులుగల్గిన భోగివాడు

కలువపూల యోగివాడు సిరులుగల్గిన భోగివాడు
హరునిసైతం మాయజేసె వేయిపేర్ల మాయలోడు

రథమునైన తోలేవాడు కోతిమూకల గారడోడు
కత్తిసైతం మర్చిపోయి మొసలిజంపిన మావటోడు

బలినితోక్కిన పొట్టివాడు విల్లుపట్టిన పొడగరాడు
వెన్నజున్నులు దొంగలించే ద్వారకేలే రాజువాడు

కొండనైన మోసేటోడు గోడలోన దాగినోడు
రాయినైనా మనిషి చేసిన శిల్పివాడు

Wednesday, July 29, 2009

సతతము వర్ధిల్లు సాయినాధవరసుత

మా నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా నేను రాసిన పద్యం

శకుంతలసుత ధీ బలోధిత
అర్థశాస్త్ర వేద్య అన్య పాండిత్యవేత్త
సర్వజనహితకర్మన్యోనుత
బాధ్యతాయుత సర్వోత్తమపిత
త్వమసుత హితరక్షన్విత
సతతము వర్ధిల్లు సాయినాధవరసుత